రామగిరి, జులై 04 : విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకుని, స్వీయ పరిశధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తే వాటికి పేటెంట్ తీసుకోవడం సాధ్యమేనని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూ సైన్స్ కళాశాలలో శుక్రవారం వర్సిటీ అండ్ శ్రాస్త సాంకేతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. సామాజిక సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ నివేద, చరణ్ తేజ్‌లు మేధో సంపత్తి హక్కులపై విద్యార్థులకు వివరించారు. యూనివర్సిటీ ఐపీఆర్ సెల్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యవరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎంజీయూ వీసీ అన్నారు. గతంలో నాటిన మొక్కలను సంరక్షణ చేయడంతోనే నేడు వర్సిటీ హరిత వనంలా పచ్చదనంతో కనిపిస్తుందన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ‘వనమహోత్సవం’ నిర్వహంచడంతో వీసీ ముఖ్య అతిథిగా హాజరై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మురళి, డాక్టర్ వై.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.