– బీఆర్ఎస్ అనంగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్‌రెడ్డి
అనంతగిరి, సెప్టెంబర్ 01 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల హామీల అమలులో వారి వైఫల్యాలను నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 2న కోదాడలో నియోజకవర్గ స్థాయి ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అనంతగిరి మండల అధ్యక్షుడు నల్లా భూపాల్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హామీల అమలుకు ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఎండీ అఫ్జల్, సీనియర్ నాయకుడు పందిరి వీరయ్య, శాంతినగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అక్బర్, కొత్తపల్లి ఏసు, పల్లపు నరసింహారావు పాల్గొన్నారు.