కట్టంగూర్, మే 13 : కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బుధవారం గ్రామంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అందులో ఏడుగురు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. అధ్యక్షుడిగా రత్నం రాములు, ఉపాధ్యక్షుడిగా కోనేటి వెంకటయ్య, కార్యదర్శిగా కట్ట నరేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. నూతన కమిటీ ఎన్నికపై గ్రామంలోని మత్స్యకారులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.