నల్లగొండ రూరల్, జూన్ 09 : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. జేఏసీ కార్యచరణలో భాగంగా నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎన్.వెంకట్రెడ్డికి 15 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు చెల్లించి, గ్రాంట్ విడుదల చేయాలని కోరారు.
తమకు వచ్చే నెల జీతాలు గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రహేన బేగం, మహమూద్ , రాజశేఖర్, నారాయణరెడ్డి, జావిద్, సాయి, మౌనిక ,రేణుక, ఆశ, మంజుప్రియ, సింధు, సంధ్యారాణి, ప్రియాంక, ప్రవీణ్, సునీతారెడ్డి, జానకమ్మ పాల్గొన్నారు.