తిప్పర్తి, ఏప్రిల్ 09 : బర్రెను ఢీకొని 20 నిమిషాల పాటు పల్నాడు సూపర్ ఫాస్ట్ రైలు ఆగిన సంఘటన గురువారం తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిప్పలమ్మగూడెం ఎల్ సి గేట్ 56 దగ్గర గుంటూరు నుండి వికారాబాద్ వెళ్తున్న బండి నెంబర్ 12747 పల్నాడు సూపర్ ఫాస్ట్ రైలు తిప్పలమ్మ గూడెం దగ్గరికి రాగానే ఓ బర్రెను ఢీ కొట్టింది. దీంతో బర్రె రైలు కింద పడడంతో దానిని తొలగించేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. అనంతరం రైలు తిరిగి వికారాబాద్‌కు బయల్దేరిందని తిప్పర్తి రైల్వే మాస్టర్ రవి తెలిపారు.