పాలకవీడు, డిసెంబర్ 9 : మన ఊరు – మన బడి పథకం కింద నిధులు మంజూరైన పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈఓ అశోక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జాన్పహాడ్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, పాలకవీడు, కల్మటితండా, కొత్త తండా, మహంకాళిగూడెం, బొత్తలపాలెం పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు -మన బడి పథకం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.
జాన్పహాడ్, బొత్తలపాలెం ఉన్నత పాఠశాలల్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఎం శ్రీరాంరెడ్డి, బాలూనాయక్, శీనయ్య, అనంతరెడ్డి పాల్గొన్నారు.