చౌటుప్పల్, ఏప్రిల్ 27 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన పెంటిగారి నరసింహ, కమలమ్మ కుమార్తె సంతోష ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా అందుకుంది. “Toxicity Evaluation of Certain Pesticides using Paramecium caudatum and Daphnia magna” అనే అంశంపై ఆమె చేసిన విశ్లేషణాత్మక పరిశోధనకు ఈ అవార్డు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు అమాచి మార్గదర్శకత్వం వహించారు. సంతోషకు డాక్టరేట్ లభించడం పట్ల గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.