నల్లగొండ, జూన్ 11 : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన నామా సోమేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన డాక్టరేట్ (Ph.D.) పట్టా పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని కంది లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఆయన టెక్నికల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పట్ల అంకితభావంతో పరిశోధనలు నిర్వహించి ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్‌ను సాధించారు.