చిట్యాల, ఏప్రిల్ 09 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మతు కారణంగా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇది గ్రామంలో పంట పొలాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నర్సింహ, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చెరుకు సైదులు, పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, జనార్ధన్, ఉద్యమ నాయకుడు జనపాల శ్రీను, యాదవ సంఘం అధ్యక్షుడు బొడ్డు శ్రీను, ఉయ్యాల నరేశ్, మర్రి రమేశ్, మర్రి శ్రీకాంత్ పాల్గొన్నారు.