కోదాడ, ఆగస్టు 31 : విశ్రాంత ఉద్యోగులందరూ వృద్ధాప్యాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆగస్టు నెలలో జన్మదినం జరుపుకుంటున్న విశ్రాంత ఉద్యోగుల 40వ సామూహిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేనేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని తోటి సభ్యులతో పంచుకుంటూ, ఆనందంగా గడపడానికే ఈ సామూహిక వేడుకలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జన్మదినం జరుపుకున్న సభ్యులందరికీ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి, సభ్యులను ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, యూనిట్ కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఉపాధ్యక్షుడు యెస్దాని, అసోసియేట్ అధ్యక్షుడు వరకాల జానయ్య, కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ బాలేమియా, వెంకట్ రెడ్డి, జగన్మోహన్ రావు పాల్గొన్నారు.