పెట్టుబడులకు మార్కెట్లో రకరకాల మార్గాలుంటాయి. వాటిలో హైబ్రిడ్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. మరి వీటి మధ్యగల తేడాలేంటో తెలుసుకుందామా?..
హైబ్రిడ్ ఫండ్స్ అంటే?
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. ఇవి ప్రధానంగా ఈక్విటీ, డెట్ మార్కెట్లు సహా రకరకాల తరగతుల ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో గోల్డ్, రియల్ ఎస్టేట్లలో కూడా పెట్టుబడి పెడుతాయి. నిజానికి పూర్తిగా డెట్ ఫండ్స్ల్లోనో లేదా పూర్తిగా ఈక్విటీ ఫండ్స్ల్లోనో పెట్టుబడులు పెట్టడం కంటే ఈక్విటీ-డెట్ కాంబినేషన్లో పెట్టుబడులు పెడుతున్న దగ్గర్నుంచి ఈ హైబ్రిడ్ ఫండ్స్.. మదుపర్లకు ఎక్కువ రాబడుల్ని అందిస్తున్నాయి. పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని ఆశించే మదుపర్లకు ఇవి అనువైనవని చెప్పవచ్చు. అయితే ఈక్విటీ-డెట్ మోతాదులనుబట్టి, 2023 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత? అనేదాన్నిబట్టి పన్నులు ఆధారపడి ఉంటాయి.
హైబ్రిడ్ ఫండ్స్‌ను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఏడు ఉప విభాగాలుగా వర్గీకరించింది. ఫండ్‌లో ఆస్తి వర్గాల కూర్పు ఆధారంగా ఈ విభజన జరిగింది. ఇక వీటిలో..
అగ్రెసివ్: 65-80 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో.. 20-35 శాతం రుణ సాధనాల్లో పెట్టుబడి.
కన్జర్వేటివ్: 10-25 శాతం ఈక్విటీ-ఈక్విటీ ఆధారిత సాధనాల్లో.. 75-90 శాతం రుణ సాధనాల్లో పెట్టుబడి.
బ్యాలెన్స్డ్: 40-60 శాతం ఈక్విటీ-ఈక్విటీ ఆధారిత సాధనాల్లో..40-60 శాతం రుణ సాధనాల్లో పెట్టుబడి.
మల్టీ-అసెట్ అల్లోకేషన్: ఒక్కో అసెట్ క్లాస్‌లో కనీసం 10 శాతం పెట్టుబడితో మూడు అసెట్ క్లాస్‌లకు తగ్గకుండా పెట్టుబడులు.
డైనమిక్-అసెట్ అల్లోకేషన్: 0-100 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో, 0-100 శాతం రుణ సాధనాల్లో పెట్టుబడులు.
ఆర్బిట్రేజ్: ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో కనీసం 65% పెట్టుబడులుంటాయి.
ఈక్విటీ సేవింగ్స్: ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో కనీసం 65 శాతం, రుణ సాధనాలు, డెరివేటివ్స్‌లో కనీసం 10 శాతం పెట్టుబడులుంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఈ ఫండ్లు రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. అయితే వీటి నిర్వహణ ప్రైవేట్‌గా ఉంటుంది. అంటే సెబీ నియంత్రణలో ఉండవు. నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) ప్రకటించవు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా.. అధిక రాబడులను మదుపర్లకు అందించడమే వీటి లక్ష్యం. ఇందుకు సంప్రదాయేతర పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తాయి. ఈ క్రమంలోనే డెరివేటివ్స్, పరపతి-ప్రత్యామ్నాయ సాధానాల వాడకం ఉంటుంది. పైగా మ్యూచువల్ ఫండ్స్ మాదిరి పారదర్శకంగా ఉండవు. కనుక హెడ్జ్ ఫండ్స్‌లో పెట్టుబడులు అధిక రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఇక వీటికి కనీస పెట్టుబడి పరిమితులుంటాయి. కాబట్టి హై నెట్-వర్త్ ఇండివిడ్యువల్స్, సంస్థాగత మదుపర్లే పాల్గొనాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అనువు కావు.