నీలగిరి, మే 31 : అమృత్-2 పథకంలో భాగంగా పట్టణంలో నిరుపేదలందరికీ రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నందున సభ్యులందరూ తమ వార్డుల పరిధిలో పేదలకు కనెక్షన్లు ఇప్పించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సూచించారు. కౌన్సిల్ హాల్లో మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో నీటి లీకేజీని అరికట్టి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నాయకత్వంలో విడుదలైన నిధులతో పట్టణాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజలను ప్రోత్సహించాలని సభ్యులను కోరారు.
పట్టణాభివృద్ధిలో అనుభవజ్ఞులైన ప్రముఖులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. పట్టణంలో దాదాపు రూ. 200 కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరుగుతున్నందున రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత నిర్మాణాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ పిల్లి రామరాజు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటిని త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కమిషనర్ కేవీ రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఏసీపీ నాగిరెడ్డి, ఈఈ శ్రీనివాస్, టీపీఓ శివ, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, ఖయ్యుంబేగ్, రాజేశ్వరీమోహన్బాబు, పర్హత్ ఫర్జానా ఇబ్రహీం, భవాని, గణేశ్, మహ్మద్ సమీ, శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.