సూర్యాపేట, ఆగస్టు 3 : జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టరేట్లోని కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఫైళ్లు, ఉపాధి కోసం పెట్టుకున్న దరఖాస్తులు, స్వయం ఉపాధి రుణాల కోసం వచ్చిన అర్జీలను పాత కార్యాలయంలోనే వదిలేశారు. వాటికి సంబంధించిన వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రతి దరఖాస్తునూ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అధికారులు గాలికి వదిలేయడం విస్మయం గొల్పుతున్నది. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనసూయను వివరణ కోరగా.. తాను ఆ సమయంలో అనారోగ్య సమస్యలతో సెలవులో ఉన్నానని తెలిపారు. నెల రోజుల క్రితమే విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు.