‘నాలుగేండ్లుగా వేధింపులు.. ఇక భరించలేక ఆందోళన బాట’
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్స్ మంగళవారం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ తీరును తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మొత్తం నర్సింగ్ ఆఫీసర్స్‌లో..
– నల్లగొండ జీజీహెచ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ తీరుపై నర్సింగ్ ఆఫీసర్స్ ఫైర్
– కనీస మౌలిక సదుపాయాల లేమిపై ఆందోళన
– సెక్యూరిటీ, శానిటేషన్‌కు తమనే బాధ్యులను చేస్తున్నారని ఆవేదన
నీలగిరి, ఆగస్టు 25 : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్స్ మంగళవారం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ తీరును తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మొత్తం నర్సింగ్ ఆఫీసర్స్‌లో 80 శాతం మంది ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నట్లు, తామంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగేందుకు నీళ్లు ఉండవని, వాష్ రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉండవన్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారన్నారు. మిడ్‌నైట్‌లో సెక్యూరిటీ ఉండదు. శానిటేషన్ విభాగం ప్రాపర్‌గా ఉండదు. అన్నింటికి నర్సింగ్ ఆఫీసర్స్‌నే బాధ్యులను చేస్తున్నట్లు వాపోయారు. సదరు కారణాలు చూపిస్తూ ఒక్క ఆగస్టు నెలలోనే 14 మంది ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్‌కు మోమోలు ఇవ్వడం దారుణ విషయమన్నారు.
ప్రధానంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ఫైన చాలా అక్కసుతో ఉంటున్నట్లు వెల్లడించారు. చెప్పుకోలేని పదాలతో తమను దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ లోపమున్నా, పారిశుధ్య లోపమున్నా ఇలా అన్నింటికి నర్సింగ్ ఆఫీసర్స్‌ను బాధ్యులను చేస్తూ మోమోలు ఇస్తూ తమను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులతో ప్రేమగా ఉండండి అని తమకు చెప్పే అధికారులు ఉద్యోగులతో కూడా అదేవిధంగా ఉండాలని వారికి తెలియదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు ఇదే విధమైన ప్రవర్తనతో వేగుతూ ఇక భరించలేక నేడు బయటకు వచ్చి ఇలా తమ వేదనను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన
ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా
ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ… pic.twitter.com/2pNN86b5Vg
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
నర్సింగ్ ఆఫీసర్స్ ఆందోళనపై డిప్యూటీ సూపరింటెండెంట్ డా.నగేశ్‌ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా ఈ నెల 23న మెడికల్ లీగల్ కేసు కు సంబంధించి ఓ రోగి ఆస్పత్రిలో చేరి, అదే రోజు రాత్రి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయినా 24న ఆ రోగి ఉన్నట్లు, అతడికి వైద్యం అందించినట్లు రికార్డుల్లో రాశారు. ఈ విషయమై సదరు డాక్టర్లు, స్టాఫ్ నర్సులకు మోమోలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

నాలుగేండ్లుగా వేధింపులు.. ఇక భరించలేక ఆందోళన బాట
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

