గుర్రంపోడ్, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, ప్రజలపై చిత్తశుద్ధి లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గుర్రంపోడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా చేయకుండా అన్నదాతను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటీవల జరిగిన హుజూర్నగర్ మీటింగ్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారని, తాటాకు చప్పుళ్లకు ఏ బీఆర్ఎస్ కార్యకర్త భయపడడని తెలిపారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలానికి ఇచ్చిన ఇండ్ల స్థలాలను కొర్రీలు పెట్టకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని అన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పామనగుండ్ల వెంకన్న, మాజీ ఎంపీపీ శ్యామల బొజ్జయ్య, నాయకులు నాగులవంచ నాగేశ్వర్రావు, కామళ్ల రాములు, మేకల వెంకట్‌రెడ్డి, షేక్ సిరాజ్, కూనూరు సైదిరెడ్డి, కంచాని చంటి, సంకటి గిరి, ఇనుపాముల రామారావు, మల్లోజు శ్రీనివాసాచారి, కొండ్రపల్లి గిరి, ఏలుకొండ నగేశ్, కూర బాల్‌రాజ్, వనమాల మహేందర్, మేడి లింగయ్య, షేక్ ఖాసీం, వాకిటి చంద్రయ్య, జాల మల్లేశం, పర్శనబోయిన వెంకన్న, షేక్ మోయిన్, మోగావత్ భాస్కర్, చిరంజీవి పాల్గొన్నారు.