గురుకులాల్లో గుక్కెడు నీరు కూడా కరువే
కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పది రోజులుగా విద్యార్థినులు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఆయన బుధవారం పాఠశాలను సందర్శించారు.
- కాంగ్రెస్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆగ్రహం
నిడమనూరు, జూలై 22 : కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పది రోజులుగా విద్యార్థినులు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఆయన బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు బకెట్లలో నీటిని మూడో అంతస్తుకు మోసుకెళ్తున్న తీరును చూసి ఆవేదన చెందారు. సమస్యను వివరించేందుకు జిల్లా కలెక్టర్కు ఫోన్ చేయగా స్పందించలేదు.
ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ నిరుపేద బాలికలు విద్యనభ్యసిస్తున్న గురుకులాల్లో పది రోజులుగా తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నా సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారులకు ఉపాధ్యాయులు పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి తాగు నీటి సమస్యను పరిష్కరించి విద్యార్థినుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు లకుమాల మధుబాబు, పిల్లి అభినయ్ యాదవ్, రాయినబోయిన రామలింగయ్య, లక్ష్మణ్, మహ్మద్ తౌసిఫ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

