రామగిరి, మే 25 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు కె.నవ్య, జే.శిరీష ది ఇండియన్ ఉమెన్ అండ్ మ్యాథమెటిక్స్ (IWM) ఆర్గనైజ్ చేసే సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం ఎంపికయ్యారు. వీరు జూన్ 22 నుండి జులై 2 వరకు బిట్స్ పిలానీ హైదారబాద్ క్యాంపస్ నందు శిక్షణకు హాజరు కానున్నారు. ఐఐటీ ప్రొఫెసర్స్, వివిధ రాష్ట్రాల సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి వెంకట్ రెడ్డి, అధ్యాపక బృందం డాక్టర్ మధుకర్, కనకయ్య, మతిన్ హుస్సేన్, బాల కార్తీక్ విద్యార్థినులకు అభినందనలు తెలిపారు.