న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరానికి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్లు చేసి స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేల్చి కేరింతలతో హోరెత్తించారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం సంబురాల్లో మునిగితేలారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇంటి ముంగిళ్లను రంగవల్లులతో అలంకరించారు. తమ ఇష్ట దైవాలను దర్శించుకొని ఆశలు నెరవేరాలని, సంవత్సరం అంతా మంచి జరుగాలని కోరుకున్నారు. యాదగిరి గుట్ట ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.