రామగిరి, మే 23 : నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల ‘న్యూస్ స్కూల్’ విద్యార్థి నేలపట్ల లోకేష్ కుమార్ పాలీసెట్-2026 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 120 మార్కులకు 118 మార్కులు పొంది 35వ ర్యాంక్ సాధించాడు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ గంట్ల అనంత రెడ్డి విద్యార్థికి పుష్ఫగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తమ విద్యాసంస్థ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ గంట్ల పద్మ, ప్రిన్సిపాల్ అలుగుబెల్లి తిరుమల్ రెడ్డి, అలుగుబెల్లి స్పందన, ఉపాధ్యాయులు పర్వత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కవిత పాల్గొన్నారు.