మిర్యాలగూడ టౌన్, జనవరి 27 : గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పాలకవర్గం ఆలోచన విధానాలతో లాభాల బాటలో పయనిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు మంజూరైన నూతన బస్సులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాలకవర్గంతో మాట్లాడి డిపోకు 21 నూతన బస్సులను అలాట్ చేసేలా కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తున్న డిపోల్లో మిర్యాలగూడ డిపో 4వ స్థానంలో ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది, అధికారులను అభినందించారు. కార్యక్రమంలో అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, మదార్ బాబా, టీఆర్ఎస్వీ నాయకులు ఎండీ.షోయబ్, డీఎం పాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.