సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి.. ఎంపీ బుడుగుల, ఎమ్మెల్యే రవీంద్రకుమార్

నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు అన్నారు. ఆదివారం మం డలంలోని కాచరాజుపల్లి గ్రామంలో రూ.5లక్షలు ఎంపీ నిధులతో సీసీ రోడ్డు, రూ. 5లక్షలు ఏసీడీపీ నిధులతో పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెంది హరితవనంగా మారిందన్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాచరాజుపల్లిలో ప్రతి ఇంటికీ మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. త్వరలో కంబాలపల్లి లిప్టు ద్వారా సాగునీరు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
యాదవ సంఘం నాయకులు కమిటీ నిర్మాణం కావాలని వారిని కోరడంతో నిర్మాణం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు గుండ్లమఠం తులసీసాత్ దేవాలయంలో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానిం చారు.
కార్యక్రమంలో ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ బాలునాయక్, బావోజీ బిక్కునాయక్, బలియ్య, సర్పంచ్‌లు నాగు, శంకర్ నాయక్, వెంకటయ్య, బాలు, సర్వయ్య, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, పీఆర్ఏఈ రాజు, తిరుపతయ్య, హనుమా నాయక్, బుజ్జినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

