పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకుడు నీల రవికుమార్‌తోపాటు 300 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. బీజేపీతో ప్రజలకు న్యాయం జరుగడం లేదని, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా నీల రవికుమార్ తెలిపారు. చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తోపాటు నాయకులు కేతావత్ బీల్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, బొడ్డు గోపాల్, బొడ్డుపల్లి కృష్ణ, పొట్ట మధు తదితరులున్నారు.
దేవరకొండ, అక్టోబర్ 19 : దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నాయకుడు నీల రవికుమార్‌తో పాటు 300 మంది కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే వివిధ పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయన్నారు. దాంతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా బీమా అందిస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. బీజేపీ నాయకుడు నీల రవికుమార్ మాట్లాడుతూ బీజేపీలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేమనే బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కెతావత్ బిల్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, బొడ్డు గోపాల్, బొడ్డుపల్లి కృష్ణ, పొట్ట మధు పాల్గొన్నారు.