దేవరకొండ రూరల్, మే 12 : కార్మిక పక్షపాతి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నాయిని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు నాయిని నరసింహారెడ్డి అని కొనియాడారు. రాజకీయాల్లో ఆస్తుల కంటే ఎక్కువగా పేరు, గౌరవం సంపాదించిన అరుదైన నాయకుడు నాయిని అన్నారు. పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన నాయిని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి కృష్ణ, ఆరుగంటి రాములు, లోహిత్ రెడ్డి, చంద్రమౌళి, రేపాని ఈద్దయ్య, మాడెం రాములు పాల్గొన్నారు.