అర్వపల్లి, ఏప్రిల్ 24 : జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక గ్రామ సభ సమావేశం, ప్రతిజ్ఞ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి మాలోతు బిచ్చునాయక్ మాట్లాడుతూ… దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలే అని, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణ మూర్తి, వీబీకే యాదమ్మ, ఆశ కార్యకర్త కవిత, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.