మద్దిరాల, డిసెంబర్ 22 : జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గణిత శాస్త్రం అభివృద్ధి, మానవాళి పెరుగుదలలో దాని ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. మద్దిరాల మండలంలోని చిననెమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిత్య జీవితంలో గణితం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. హెచ్ఎం డి.శివయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శాస్త్ర పాఠశాలలో..
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట పట్ణణ పరిధిలోని రాయిన్‌గూడెం గ్రామ సమీపంలో గల శాస్త్ర పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల గణిత వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన ఆకట్టుకున్నది. పాఠశాల చైర్మన్ ఎం. చంద్రశేఖర్ ప్రదర్శనను తిలకించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కరుణారావు, పుష్పలత పాల్గొన్నారు.
వెంపటి పాఠశాలలో..
తుంగతుర్తి : ప్రతి విద్యార్థి మ్యాథమెటిక్స్‌పై ఇష్టం పెంచుకుని రాణించాలని వెంపటి పాఠశాల హెచ్ఎం వెంకటరామనర్సమ్మ అన్నారు. పాఠశాలలో నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకల్లో ఆమె మాట్లాడారు.
నాగారం ప్రాథమిక పాఠశాలలో..
నాగారం : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం వర్దెల్లి మల్లయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ చిప్పలపల్లి మల్లేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : నిత్య జీవితంలో గణితానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నదని ఆత్మకూర్.ఎస్ జడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎం కొత్తపల్లి సుదర్శన్‌రెడ్డి అన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గులు, క్విజ్, పాటల పోటీలు నిర్వహించారు.
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్, అర్వపల్లి, నాగారం కేజీబీవీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణితమేళా, ముగ్గులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెంకట్‌రెడ్డి, ఉమా, ఎస్ఓలు నాగరాణి, శిరిన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని మండల వ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐడీఎల్ స్కూల్లో విద్యార్థులకు గణిత క్విజ్ నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గాంధీనగర్‌తండా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు మ్యాథ్స్డే ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఓ హరిత, కరస్పాండెంట్ ఎస్వీ రమణకుమార్, వీరబాబు, అనూష పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలంలోని అంత్యతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అల్లీపురం జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం సీహెచ్ చిరంజీవి, మండల నోడల్ ఆఫీసర్ ఆర్.వేణుగోపాల్, హెచ్ఎం ఎస్కే మస్తాన్ పాల్గొన్నారు.
కృష్ణవేణి పాఠశాలలో..
నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు గణిత అభ్యసన సమర్థ్యాలపై శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లు గడ్డం జగన్మోహన్రెడ్డి, కట్టా నలిని, రమేశ్ పాల్గొన్నారు.
గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో..
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మ్యాథ్స్‌లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుధాకర్, పాల్గొన్నారు.
కరివిరాల మోడల్ స్కూల్లో..
నడిగూడెం : మండలంలోని పాఠశాలల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరివిరాల మోడల్ స్కూల్లో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకున్నది. స్థానిక గురుకుల పాఠశాలలో శ్రీనివాసన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరివిరాల, గురుకుల కళాశాలల ప్రిన్సిపాల్స్ షరీఫ్, ధనవిజయలక్ష్మి పాల్గొన్నారు.