ఆత్మకూర్.ఎస్, జనవరి 24 : ఆత్మకూర్.ఎస్ మండలం దాచారం టీజీ మోడల్ స్కూల్ అండ్ కేజీబీవీ స్కూల్ అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రియాంక, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ప్రసాద్, ఏఎన్ఎం అన్నపూర్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజులత, స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ రమేశ్ ఏకమల్, జ్యోతి, సామ్రాజ్యం, రుక్మిణి, శ్రీను, గణేష్, ఎంవీ ఫౌండేషన్ మండల ఇన్చార్జి వత్సవాయి లలిత పాల్గొన్నారు.

Atmakur.S : దాచారంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

Atmakur.S : దాచారంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం