నల్లగొండ, ఆగస్టు 15 : బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.