చింతాబాబు మాదిగకు జాతీయ పురస్కారం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్టు కోదాడలో మంగళవారం చింతా బాబు మాదిగ తెలిపారు.
కోదాడ, నవంబర్ 10 : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్టు కోదాడలో మంగళవారం చింతా బాబు మాదిగ తెలిపారు. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నట్లు వెల్లడించారు. గత మూడు దశాబ్దాలుగా సామాజిక రంగంలో సేవలు అందించినందుకు, మార్గదర్శి, స్ఫూర్తి యువజన సంఘాల ద్వారా యువతను చైతన్య పరిచినందుకు ఈ అవార్డు లభించిందని వెల్లడించారు. గతంలో ఫ్రెండ్షిప్ సొసైటీ అవార్డులు, ‘దళిత రత్న’ పురస్కారం పొందడంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ‘మాదిగ బంధు’ బిరుదును అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ అవార్డు ప్రకటన పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khet Bachao Abhiyan | ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలి.. ‘ఖేత్ బచావో అభియాన్’ లో ఏడీఏ బాబు నాయక్
‘ఏఐకేఎస్ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి’
చింతాబాబు మాదిగకు జాతీయ పురస్కారం
‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

