నల్లగొండ రూరల్, డిసెంబర్ 01 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నవంబర్ 28, 29 తేదీల్లో జరిగిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి ఖో ఖో బాలికల విభాగంలో నల్లగొండ మండలంలోని నర్సింగ్ భట్ల పాఠశాల జట్టు మొదటి బహుమతి సాధించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన జట్లు పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన పాఠశాల జట్టు ఈ నెలలో హైదరాబాద్‌లో జరగబోయే పీఎం శ్రీ పాఠశాలల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గెలుపొందిన పాఠశాల జట్టులో విద్యార్థినీలకు ప్రధానోపాధ్యాయుడు డి.మారయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లీశ్వరీ, ఉపాధ్యాయులు యాదయ్య, గోపాల్‌రెడ్డి, యాదగిరి, సైదులురావు, రవీంద్రచారి, వినోద్‌కుమార్, వేణుకుమార్, రామకృష్ణ, పద్మావతి, శ్రీదేవి, వాణి అభినందనలు తెలిపారు.