గట్టుప్పల్, ఆగస్టు 13 : గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత బట్టపోతుల నర్సింహ సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. నర్సింహ 4వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్నె గ్రామంలోని చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి బుధవారం పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో దళితులకు కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇప్పించడంలో నర్సింహ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దెంద బీరప్ప, సీనియర్ జర్నలిస్ట్ బట్టపోతుల ప్రదీప్, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు షేక్ నూర్ మహ్మద్, మండల యూత్ ఉపాధ్యక్షుడు బాలం మహేశ్, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు పర్సగోని యాదగిరి, సీనియర్ నాయకులు బీమనపెల్లి యాదయ్య, రావుల యాదగిరి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు బీమనపెల్లి లింగస్వామి, వనం వెంకటయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.