నందికొండ, ఫిబ్రవరి 04 : నాగార్జునసాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డులో శ్రావణి, 2వ వార్డులో ఘణి, 3వ వార్డులో హర్ష, 4వ వార్డులో ఎల్.అన్నపూర్ణ, 5వ వార్డులో పెద్దయ్య, 6వ వార్డులో సపావత్ చంద్రమౌళి, 7వ వార్డులో సయ్యద్ షాహిదాబేగం, 8వ వార్డులో నకిరేకంటి రమణ, 9వ వార్డులో బత్తుల శేఖర్ బాబు, 10 వార్డులో కోడ సరోజ, 11వ వార్డులో హిరేకార్ రమేష్, 12వ వార్డులో ఎర్ర మంజుశ్రీలతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి ఎన్నికల ప్రచారంను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయితీ కూడా కానీ నాగార్జునసాగర్‌ను బీఆర్ఎస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీగా చేసి ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర కాలంలో నందికొండ మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజురైన పనులకే కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేస్తు తాము ఆ పనులు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నందికొండ మున్సిపాలిటీలో బుద్ధవనం, 100 పడకల దవాఖాన, లాంచీ స్టేషన్, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల వంటివి అనేకం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే రానున్నదని నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని, కావునా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎక్కులూరి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు.