చండూరు, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నల్లగొండ జిల్లా చండూరు మండల నూతన అధ్యక్షుడిగా నాంపల్లి సైదులు, ప్రధాన కార్యదర్శిగా పెండెం గంగాధర్ ఎన్నికయ్యారు. మంగళవారం యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయం నందు జరిగిన చండూరు మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి చిక్కుళ్ల రామలింగయ్య, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల్ల వెంకటేశం వ్యవహరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ చండూరు మండలం ఉపాధ్యక్షులుగా బొమ్మరబోయిన సైదులు, కత్తుల మమత, కోశాధికారిగా రావిరాల రమేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగిళ్ల సైదులు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, చండూరు మండలం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Chandur : యూటీఎఫ్ చండూరు మండలాధ్యక్షుడిగా నాంపల్లి సైదులు