Nallagonda | కొండమల్లేపల్లి, జూన్ 22 : 22 బస్తాల నల్లబెల్లం, 10 కిలోల పటిక పట్టుకున్న ఘటన అదివారం మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో చోటు చేసుకుంది. నల్లగొండ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనీయ సమాచారం మేరకు హైదరాబాద్ రోడ్డులో వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా డిండి మండలంలోని బొగ్గులదోన గ్రామానికి చెందిన బాలకోటి అనే వ్యక్తి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులను గమనించి తన ఇండిక కారును వదిలి పారిపోయాడు. అట్టి టాటా ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న 22 బస్తాల నల్లబెల్లం, 10 కిలోల పటిక లభించాయి. వెంటనే ఇండికా కారును సీజ్ చేసి పారిపోయిన బాలకోటి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సంతోష్ తెలిపారు. సీజు చేసిన నల్లబెల్లం, పట్టిక విలువ సుమారుగా ఆరు లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. అయన వెంట సీఐ రాకేష్, సిబ్బంది అయూబ్ శేఖర్‌రెడ్డి, రమేష్ పాల్గోన్నారు.