నల్లగొండ, అక్టోబర్ 30: ఎన్నికల్లో ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే విజయమని నల్లగొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థ్ది కంచర్ల భూపా ల్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 11,38,48 వార్డుల్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డితో కలిసి సోమవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. నాయకులు లేకు న్నా ప్రజలే నా నమ్మకం..నా ధైర్యమని ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తానని అన్నారు. ప్రస్తుతం నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి ఆరంభం మాత్రమే అని ఇంకా చాలా ముందే ఉందని అన్నారు.
కాం గ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుక్కెడు మంచినీళ్లకు కూడా అరిగోస పడ్డట్లు తెలిపారు. అలాంటి పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ ఈ రా ష్ర్టాన్ని బయటకు తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చి మరోసారి మోసం ప్రయత్నం చేస్తుందని దీన్ని ప్రజలు గమనించి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు.
నల్లగొండ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ మ్యానిఫెస్టో పెట్టినట్లుగా ఈ సారి అధికారంలోకి రాగానే మార్చి నుంచి ఆసరా పింఛన్తో పాటు తెల్లకార్డు కలిగిన వారికి ఉచిత బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం వార్డుల్లో చాడ కిషన్రెడ్డితో కలిసి ప్రచారం చేయగా వీధులన్నీ కిక్కిరిశాయి. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి నుదుట తిలకం దిద్ది కంచర్లకు మద్దతు పలకగా యువత పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్ యామ కవితా దయాకర్, వట్టిపల్లి శ్రీను, గుర్రం ధనలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, దండెంపల్లి సత్తయ్య, కంకణాల వెంకట్ రెడ్డి, కాసం శేఖర్, చైతన్య పాల్గొన్నారు.