నల్లగొండ రూరల్, సెప్టెంబరు 11 : తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కాశిమల్ల విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి చైర్మన్ పల్లపు విజయ్, రాష్ట్ర అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన పల్లపు విజయ్, గోడుకొండ్ల ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.