గణేశ్ నవరాత్రోత్సవాలను ఊరూవాడ సంబురంగా నిర్వహించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ముందస్తుగా నిమజ్జనోత్సవాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు పలు చోట్ల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు.