
నీలగిరి: విద్యుదాఘాతంతో గణేశ్ మండపం దగ్ధమైన ఘటన శనివారం రాత్రి నల్లగొండ మండలం పాత నర్సింగ్భట్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతూరు గ్రామస్థులు వేప చెట్టు కింద తాటాకులతో మండపాన్ని తయారు చేసి గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
కాగా కరెంటు వైర్లు కిందికి ఉండడంతో శనివారం రాత్రి వచ్చిన గాలికి రెండు వైర్లు ఫేస్ టూ పేస్ అయ్యి నిప్పురవ్వలు మండపంపై పడడంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. ఏలాంటి అస్తి నష్టం జరుగలేదు. అనంతరం గ్రామస్థులు వెంటనే వినాయకుడి నిమజ్జనం చేశారు.