నల్లగొండ సిటీ, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి ఒక్క రోజే రూ.12 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 155 వైన్స్తోపాటు బార్లు ఉండగా.. వైన్స్ అర్ధరాత్రి 12 గంటలు, బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచారు. మరోవైపు మాంసం విక్రయాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో చికెన్, మటన్, చేపలు కలిపి నిత్యం రూ.50లక్షల మేర అమ్మకాలు ఉండగా, మంగళవారం దాదాపు రూ.కోటిన్నర వరకు జరిగి ఉంటాయన్నది అంచనా.