నకిరేకల్, నవంబర్ 18 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలంలోని టేకులగూడెం(పాలెం)లో సీసీరోడ్డు పనులు, ఓగోడు గ్రామంలో వైకుంఠధామం ప్రారంభం, అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారన్నారు. ఓగోడు గ్రామంలో రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, సర్పంచులు జానయ్య, అబ్బగోని విజయలక్ష్మీ శ్రీనివాస్, ఏకుల కవితావిజయ్, సైదులు, కౌన్సిలర్ సునీల్ పాల్గొన్నారు.
పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి
నకిరేకల్ నియోజకవర్గంలో పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, భవనాల పెండింగ్ పనుల గురించి తెలుసుకున్నారు. ఆర్అండ్బీ డీఈ ఎమ్ఏ బేగ్, ఏఈ సంతోష్, పంచాయతీరాజ్ డిప్యూటీ డీఈ విష్ణువర్దన్, ఏఈ సంపత్, మున్సిపాలిటీ ఏఈ గౌతమ్ పాల్గొన్నారు.
మంగళపల్లిలో బస్‌షెల్టర్ ప్రారంభం
మండలంలోని మంగళపల్లిలో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్‌ను శుక్రవారం సర్పంచ్ ప్రగడపు నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.