భవిత సెంటర్ల ద్వారా ప్రత్యేకావసరాలు గల పిల్లలకు చేయూత
ప్రత్యేకావసరాలు గల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి భరోసా కల్పించేలా ‘విద్యాశాఖ-సమగ్రశిక్ష’ ఆధ్వర్యంలో భవిత సెంటర్లు చేయూతనందిస్తున్నాయి. వాటిల్లో ప్రతి సోమవారం ఫిజియోథెరపీ చేస్తున్నారు. అదే విధంగా ఐఈఆర్పీలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మానసిక, శారీరక, బహుళవైకల్యం కలిగిన పిల్లలు పూర్వ స్థితికి వచ్చేలా శిక్షణ అందిస్తున్నారు.
ఆ దిశగా ప్రభుత్వ సైతం ప్రత్యేక దృష్టి సారించి భవిత సెంటర్లను బలోపేతం చేసి వైద్య సేవలతోపాటు విద్యనందించేలా చొరవ తీసుకుంటుండడంతో అటు తల్లిదండ్రులు, ఇటు వైకల్యం కలిగిన విద్యార్థుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 భవిత సెంటర్లలో 8,158 మంది దివ్యాంగ చిన్నారులకు నిత్యం పరీక్షలు కొనసాగుతున్నాయి. వీటిని సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్లు(సీఎంఓ) పర్యవేక్షణ చేస్తూ అవగాహన పెంచేలా సేవలందిస్తున్నారు.
– రామగిరి, నవంబర్ 16
చిన్నారుల గుర్తింపు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ-సమగ్రశిక్ష ద్వారా తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భవిత సెంటర్లకు చెందిన ఐఈఆర్పీలు ఇంటింటికీ తిరిగి దివ్యాంగ పిల్లలను గుర్తిస్తారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వైకల్యం కలిగిన పిల్లలను భవిత సెంటర్స్‌కు తరలిస్తారు. ఈ సెంటర్లలో చిన్నారులకు వైద్య సేవలతోపాటు విద్యను అందిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు నిర్వహిస్తుండగా ప్రతి సోమవారం నిపుణులైన ఫిజియోథెరపిస్టులతో ఫిజియోథెరపీ చేయిస్తారు. వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేలా ఆత్మవిశ్వాసం కల్పిస్తారు.
ప్రతి నెలా రూ.300 అలవెన్స్
ఐఈఆర్పీల ద్వారా గుర్తించబడి మండల కేంద్రాల్లోని భవిత సెంటర్స్‌కు వచ్చే దివ్యాంగ పిల్లలకు విద్యాశాఖ ప్రతి నెలా రూ.300 చొప్పున అలవెన్స్ అందిస్తున్నది. అదే విధంగా ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యుల సూచనతో మూడు చక్రాల సైకిళ్లు, రోలేటర్స్ ఉచితంగా అందిస్తారు. క్రమం తప్పకుండా భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సదరం సర్టిఫికెట్స్ అందించేలా చర్యలు తీసుకుంటారు. ఉచిత బస్, రైల్వే పాస్‌లు సైతం అందిస్తారు.
ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు చికిత్స అందించి సాయం అందించేలా రాష్ట్ర సర్కార్ భవిత సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటిలో మానసిక, శారీరక, బహుళవైకల్యం కలిగిన దివ్యాంగ పిల్లలకు(చిన్నారులు) ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా వారిలో వైకల్యాన్ని తగ్గించడమే కాకుండా ఆత్మసైర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటారు. ఐఈఆర్పీ(ఇన్క్ల్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్) పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. వీరితోపాటు ఫిజియోథెరపీ నిపుణులు ప్రతి సోమవారం వైద్య పరీక్షలు చేసి భరోసా కల్పిస్తున్నారు.
భరోసా కల్పించేలా ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ, విద్యాశాఖ-సమగ్రశిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్స్‌కు తీసుకొచ్చే విద్యార్థులకు భరోసా కల్పించేలా నిబంధనల మేరకు శిక్షణ అందిస్తున్నాం. డీఈఓగారి ఆదేశాలను పాటిస్తూ ఐఈఆర్పీలు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలు, వాటి పరిధిలో పర్యవేక్షణ చేస్తూ వైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాలకు తీసుకొస్తారు. వారికి ఫిజియోథెరపిస్టులతో అవసరమైన శిక్షణ అందించి ఆత్మసైర్థ్యం కల్పిస్తున్నాం. అదేవిధంగా వైకల్య సామర్థాన్ని బట్టి సదరం సర్టిఫికెట్స్ అందిస్తున్నాం. బస్, రైల్పాస్లు ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం వీరికి ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు సైతం కల్పిస్తున్నది.
– వంగూరి వీరయ్య, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి, సమగ్రశిక్ష, నల్లగొండ
పిల్లల్లో ఆత్మైస్థెర్యం పెంచేందుకు కృషి
దివ్యాంగులైన పిల్లల్లో నైపుణ్యాలు పెంచి వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా కృషి చేస్తున్నాం. దివ్యాంగ బాల, బాలికలకు మేలైన సేవలందిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేలా పని చేస్తున్నాం. భవిత కేంద్రాలకు హాజరు కాని పిల్లలకు ప్రతి శనివారం వారి ఇంటికి వెళ్లి సేవలందిస్తూ తల్లిదండ్రులు, పిల్లల్లో భరోసా కల్పిస్తున్నాం. సెంటర్స్‌కు వచ్చే పిల్లలకు ఫిజియోథెరపీలో శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ ద్వారా పిల్లల్లో మానసిక ధైర్యంతోపాటు మార్పు వస్తుంది.
– సుజాత, ఐఈఆర్పీ, కనగల్, నల్లగొండ
పిల్లలకు అందించే సేవలు..