భువనగిరి అర్బన్, నవంబర్ 14: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్ అన్నారు. జాతీ య 55వ గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వ్యక్తి నడవడికను గ్రంథాలయం నేర్పుతుందన్నారు. గ్రంథాలయాలను వినియోగించుకున్న ప్రతి వ్యక్తి శక్తిగా తయారవుతాడని పేర్కొ న్నారు.
అనంతరం విద్యార్థుల సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ మల్లయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, మార్కెట్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రయ్య, జయప్రకాశ్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, రంగయ్య, గ్రంథాలయ కార్యదర్శి సుధీర్, పాలకులు మధుసూధన్‌రెడ్డి, రుకోధర్, టి.యాదగిరి పాల్గొన్నారు.