బీబీనగర్, నవంబర్ 11 : మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో ప్రమాదకర రసాయన పరిశ్రమలను మూసివేయాలని ఎనిమిది రోజులుగా గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కెమికల్ పరిశ్రమల్లో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే పరిశ్రమలలో పర్యటించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను పిలిపించి కాలుష్య కారకమైన చందక్, ఆస్టర్, అజంతా కెమికల్ పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొండమడుగు గ్రామాన్ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి మార్చడానికి కృషిచేస్తానని హామీఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలచందర్, మార్కెట్ డైరెక్టర్ ఐలయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, చంద్రశేఖర్‌రెడ్డి, కాలుష్య నిర్మూలన సమితి సభ్యులు పాల్గొన్నారు.