భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 7 : ప్రభుత్వం అందించే రుణాలు, సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావా లని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ‘కలలను సాకారం చేసుకొండి’ అనే నినాదంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)ముందుకు సాగుతుందన్నారు.
ప్రభు త్వ నిధులతో మహిళలు స్వశక్తితో ఎదగాలన్నారు. బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని, చెల్లింపులో సమగ్రంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ జోజప్ప, డీపీఎంలు సునీల్‌రెడ్డి, శ్రీనివాస్, ఏపీఎంలు గంట లింగయ్య,పి, మల్లేశం, సీసీలు అప్సర్బీ, అలివేలు, నర్సింగ్‌రావు, బాలరాజు, పుష్పలత, మేరి, లక్ష్మి, తిరుమల, అనురాధ, బాలరాణి, చంద్రకళ, ఉపేంద్ర మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.