సూర్యాపేట, నవంబర్ 5 : జిల్లాలోని 10 ఏండ్ల నుంచి 16 ఏండ్ల విద్యార్థులకు తప్పనిసరిగా డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్లు వేయించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు. శనివారం కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్లపై నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 17 వరకు జిల్లా వ్యాప్తంగా 1,101 పాఠశాలల్లోని 37,516 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. వీరితో పాటు బడి బయట ఉన్న విద్యార్థులకు సైతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారన్నారు. వైద్య, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలకు టీకా అవసరం లేదన్నారు. సమావేశంలో డీఈఓ అశోక్, ఐసీడీఎస్ పీడీ జ్యోతీపద్మ, అనసూర్య, దయానందరాణి, శంకర్, వైద్యులు పాల్గొన్నారు.