మిర్యాలగూడ రూరల్, నవంబర్ 1 : మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్‌నగర్ నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ. ఈ పంచాయతీ సర్పంచ్‌గా బోగవల్లి వెంకటరమణచౌదరిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ నిలపడమే గాక మహిళలకు ఉచితంగా శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ ఇప్పించి యునిట్ ఏర్పాటు చేసి కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించారు. మగ్గం వర్క్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న మహిళలను 32మందిని బ్యాచ్‌గా చేసి ఉచిత శిక్షణ అందించారు.
వివిధ రకాల మగ్గం వర్కులపై శిక్షణ
శిక్షణ కాలంలో మహిళలకు ముందుగా డ్రైస్, బ్లౌజులు కుట్టడం నేర్పారు. అనంతరం వివిధ రకాల క్లాత్‌లపై కుట్టు ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మగ్గం వర్క్‌లో చీరలు, చిన్నారుల వస్ర్తాలపై అనేక రకాల డిజైన్లపై శిక్షణ ఇచ్చారు. మహిళలు అనతి కాలంలో వర్క్‌పై పట్టు సాధించారు. ప్రస్తుతం గ్రామంలో 32మంది మగ్గం వర్క్‌పై శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. అంతేగాక మహిళలు శిక్షణ పూర్తైన రోజే మగ్గం వర్క్‌కు కావాల్సిన యంత్రాలను సర్పంచ్ అందించారు.
నెరవేరిన కల
ప్రస్తుతం మగ్గం వర్క్‌కు చాలా డిమాండ్ ఉంది. దీనితో నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది. కాని కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. దేవుడిలా గ్రామ సర్పంచ్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. దీంతో నా ఆసక్తి , కోరిక ఫలించింది. అనతి కాలంలోనే మగ్గ వర్క్ బాగా చేసి గుర్తుంపు పొందుతానన్న నమ్మకముంది. శిక్షణ ఏర్పాట్లు చేసిన సర్పంచ్‌కి, శిక్షణ ఇచ్చిన మాస్టర్‌కు కృతజ్ఞలు.
– ఇ.జ్యోతి, శిక్షణ పొందిన మహిళ
ఆసక్తిగా నేర్చుకున్నారు
మహిళలు మగ్గం వర్క్ ఆసక్తిగా నేర్చుకొన్నారు. నాకు తెలుగు రాకున్నా ట్రాన్స్లేషన్ చేసుకుని చెప్పే విషయాన్ని ఆసక్తిగా విని వెంటనే పట్టు సాధించారు. వీరి ఆసక్తిని చూస్తే అదనపు శిక్షణ ఇవ్వాలనన్న ఆసక్తి కలిగింది. కోల్కత్తా నుంచి వచ్చిన అన్న ఫీలింగ్ నాకు కలగకుండా మంచిగా చూసుకున్నారు. ఈ 6నెలల కాలం మరువలేనిది.
– షరుణ్లార్ద్న్, శిక్షణ మాస్టర్, కలకత్తా
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
మహిళల ఆసక్తిని గమనించి వారితో మాట్లాడి మగ్గం వర్క్ ట్రైనింగ్ ప్రారంభించాం. 32మం ది మహిళలు మగ్గం వర్క్‌లో 6నెలల పాటు శిక్షణ పొందారు. నేర్చుకోవడంలో ఆసక్తి చూపి అనతి కాలంలోనే పట్టు సాధించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఇప్పటికే గ్రామంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇప్పించాం.
– బోగవల్లి వెంకట రమణచౌదరి, శ్రీనివాస్‌నగర్ సర్పంచ్