‘సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.. సంక్షేమ పథకాలతో మాకు అండగా నిలిచిన ఆయనకు తోడ్పాటు అందిస్తాం.. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తాం’.. అని మునుగోడు ప్రజానీకం స్పష్టం చేసింది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి గ్రామస్తులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తమ మనోగతం వ్యక్తం చేశారు..
ఇంతకు ముందున్న సర్కార్లు మాకు ఇచ్చే పెన్షన్‌తో మా అవసరాలు ఏ ఒక్కటీ తిరేవి కావు. కేసీఆర్ సర్కార్ వచ్చినంక మా ముసలోళ్లకు పింఛన్ భారిగా పెంచి ఇస్తూ మా ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటుండు. దానితో మాకు ఉన్న చిన్న చిన్న అవసరాలను తీర్చుకుంటున్నాం. మేమందరం మా పెద్ద కొడుకు కేసీఆర్ కార్ గుర్తు పైన ఓటేస్తాం. టీఆర్ఎస్నే గెలిపిస్తాం.
– తలారి ముత్తమ్మ, కిష్టాపురం గ్రామం
గత ప్రభుత్వాలు యువత ఉపాధి కోసం ఏం చేయలే. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటుండు. ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదల చేసిండు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాడని నమ్మకంతో ఉన్నాం. మేమంతా కేసీఆర్‌తోనే ఉంటాం. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించుకుంటాం. యువత మద్దతు కేసీఆర్‌కే.
– యంపల్ల గంగరాజు, సింగారం గ్రామం
కేసీఆర్ అన్ని కులాలతో పాటు మా ముదిరాజ్ కులానికి కూడా పెద్దపీట వేసిండు. అందుకే ఇవాళ చండూరులో జరిగిన మీటింగ్‌కు వచ్చిన. ఏ ప్రభుత్వాలు గుర్తించని మా ముదిరాజ్‌లను కేసీఆర్ గుర్తించారు. బీజేపీ ప్రజలకు చేస్తున్న మోసాన్ని మరోసారి కేసీఆర్ మాకు వివరించారు. మేము అదే పట్టుదలతో ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసేలా చూస్తాం. టీఆర్ఎస్నే గెలిపిస్తాం.
– పండుగ యాదగిరి, కాచలాపురం గ్రామం, మునుగోడు మండలం
పైనున్న బీజేపీ వాళ్లు గ్యాస్ ధరలు, రోజు వాడుకునే వస్తువులపై లేని పోనీ పన్నులు వేసి ధరలు పెంచి మా పేదోళ్లను ముంచుతుండ్రు, ఇప్పుడు మునుగోడులో గెలిస్తే కూడా ఇంకెక్కువ పన్నులు మా మీద వేసి మమ్మల్ని బతకనీయకుండా చేస్తారు. అందుకే బీజేపీని తుక్కుతుక్కుగా ఓడిస్తాం. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపిస్తాం. మేమందరం కేసీఆర్ వెంటే నడుస్తాం.
– రేవెళ్లి అంజమ్మ, గృహిణి, మునుగోడు
కేసీఆర్ సార్‌ను చండూరు బహిరంగ సభలో చూశా. మా గురించి, మా బాగు గురించి చెప్పారు. మాలాంటి వృద్ధులకు ఆయన కొడుకులా మారారు. మా ఆకలిని తీర్చాడు. మా గోసను పట్టించుకుంటున్నడు. అందుకే నా అంతట నేనే సభకు వెళ్లాలనుకుంటున్నా. సభలో సీఎం కేసీఆర్ సార్ ను చేసోస్తా.. మూడు తారీఖుత కారు గుర్తుపై ఓటు వేస్తా.
– గుర్రం విజయ్ కుమార్, చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం తీరుతో జీఎస్టీ రూపంలో మా చేనేతల బతుకులు ఏ విధంగా ఆగమైతున్నాయో తెలుసు. ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేనేత బీమా పథకం ద్వారా మా నేత కార్మికులను ఆదుకుంటూ పింఛన్ ఇస్తున్నాడు. మరి అలాంటి పార్టీకే ఈ ఉప ఎన్నికలో నేతన్నలమంతా ఓటేస్తాం. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మా చేనేత కార్మికుల బతుకులను బాగు చేసుకోవడానికి కేసీఆర్ వెంటే మేముంటాం. మా కార్మికుల కుటుంబాల నుంచి కూడా ఒక్క ఓటు బీజేపీకి వేసేది లేదు. కారు గుర్తుకే ఓటేస్తాం. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుంటాం.
– మిర్యాల మధుకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, మునుగోడు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ దొంగలు 100 కోట్లకు కొనాలని చూసినా కొనలేరని కేసీఆర్ మరోసారి నిరూపించాడు. బంగారుగడ్డలో ప్రతి ఒక్క ఓటరుకు అర్థమయ్యేలా బీజేపీ బద్మాష్ పనులను వివరించారు. రజకులకు, మంగళివాళ్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందించి మా పాలిట దేవుడయ్యాడు. ప్రతి కులానికి కేసీఆర్ మర్చిపోలేని బహుమతినిచ్చారు. సభలో ఆయన చెప్పిన మాటలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించి టీఆర్ఎస్ విజయానికి నా వంతు కృషి చేస్తా. కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం. బీజేపీకి తగిన బుద్ధి చెప్తాం.
– బొడ్డు లక్ష్మయ్య, చొల్లేడు గ్రామం
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే మా ఓటు వేసి గెలిపించుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినంక పేదల బతుకుల్లో మార్పు వచ్చింది. బీజేపీ వాళ్లు మాలాంటి వారికి చేసిందేమీ లేదు. ఆ పార్టీ తరఫున మాకు ఒక్క పథకం కూడా అంద లేదు. అట్లాటప్పుడు అలాంటి వారికి మేము ఓటు వెయ్యం. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ మాత్రమే. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఒక డ్రామా.
– తలారి శంకరయ్య, చండూరు
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ రక్షణకు అనేక చట్టాలను తీసుకొచ్చింది. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి నా ఓటు వేస్తా. అదేవిధంగా షీటీం ఏర్పాటు చేసి కాలేజీ అమ్మాయిలకు రక్షణ కల్పిస్తున్న టీఆర్ఎస్కు మేమంతా అండగా ఉంటాం.
– బక్క జ్యోతి, ఎల్గలగూడెం(మునుగోడు)