18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి గోల్మాల్ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్, దండుమల్కాపురం, కైతాపురం, ఎల్లగిరి, కొయ్యలగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులు, బతకుమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ సర్కారు పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. సాయంత్రం ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డి.నాగారంలో అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి ప్రచారం చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి గోల్మాల్ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట, దండుమల్కాపూర్, కైతాపురం, ఎల్లగిరి, కొయ్యలగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. వారికి గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మునుగోడు ప్రజలందరికీ తెలుసన్నారు. 24 గంటల ఉచిత కరంటు కావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని, 6 గంటల కరంటు కావాలంటే బీజేపీకి వేయాలని సూచించారు. ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా రైతులకు ఉచిత కరంటు ఇవ్వడం లేదని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి కూడా మోటర్లకు మీటర్లు పెడితే ఏమవుతుందని మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో నల్లధనం వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి ఇప్పటి వరకు మాట నిలుపుకోలేదని విమర్శించారు. గ్యాస్ రూ.400 నుంచి రూ.1200 చేసినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచింది వారు కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిచిన రెండు నెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభిస్తామని, కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలిపారు.
ఆదరించండి.. రుణంతీర్చుకుంటా
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ఉప ఎన్నికలో తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గం రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని చెత్త డంపింగ్ యార్డును తేవడానికి ప్రయత్నిస్తే నాలుగు గంటల పాటు హైవేను దిగ్బంధించి వెనక్కితగ్గేలా చేశానని చెప్పారు. ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని అందించారన్నారు. గ్రామాల్లో ఒక కొబ్బరి కాయ కొడితే 100 కొట్టినట్టు అని రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాడని, గెలిచిన తర్వాత ఏ గ్రామంలోనూ తిరిగిన పాపానపోలేదన్నారు. ఎమ్మెల్యే అయి కూడా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయాడని విమర్శించారు. ప్రచారంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, సర్పంచులు రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, ఎలువర్తి యాదగిరి, గుర్రం కొండల్, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు ఖాయం
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 25 : ‘18 ఏండ్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుడికి, రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి బీజేపీ పక్కన చేరిన వ్యక్తికి జరుగుతున్న పోరు ఇది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు రావడం ఖాయం. కారు గుర్తుకు ఓటేస్తే మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోతుంది.’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలోని డి.నాగారం గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి నాలుగేండ్లు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తే ఏడాదిలో చేసేదేమీ లేదని అన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూసుకుంట్లను గెలిపిస్తే కొయ్యలగూడెం నుంచి డి.నాగారం వరకు రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని కుల సంఘాలకు విడుతల వారీగా భవనాలను కట్టిస్తామన్నారు. ప్రచారంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
దండుమల్కాపురాన్ని దత్తత తీసుకుంటున్నా..
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
దండు మల్కాపూర్, అక్టోబర్ 25 : దండుమల్కాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం దండు మల్కాపూర్‌లో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తింది. ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దండుమల్కాపూర్ గ్రామాన్ని నూటికి నూరు శాతం అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానని మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి 18 వేల కోట్ల రూపాయలకు అమ్ముడుబోయి, ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిండని విమర్శించారు. బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అని ఎద్దేవా చేశారు. 50వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనులంతా సారు, కారు, కేసీఆర్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. గుజరాతీ మోడల్ దండుగ.. కేసీఆర్ మోడల్ పండుగ అని జీవన్‌రెడ్డి