మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో బ్రహ్మాండంగా సాగింది. కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు 5 కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వెంట నడిచారు. పూల జల్లులు, పటాకుల మెరుపులు, డప్పు చప్పుళ్లతో ఉత్సాహం నింపారు. అనంతరం చౌటుప్పల్ పట్టణంలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి జనం జేజేలు పలికారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్లకు భారీ మెజార్టీ అందిస్తామని
ఉత్సాహంతో చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.