మర్రిగూడ, అక్టోబర్ 18 : ‘నేను మునుగోడు బిడ్డను.. అందరికీ అందుబాటులో ఉండేటోడిని.. నియోజకవర్గంలో ఓటు లేని రాజగోపాల్‌రెడ్డికి మనమెందుకు ఓటేయాలో.. ఒకసారి ఆలోచించాలి’ అని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలంలోని కొండూరు, ఎగ్రాళ్లపల్లి, అజిలాపురం, నర్సింహాపురం, తిరుగండ్లపల్లి గ్రామాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ బీజేపీ మోసపూరిత మాటలు నమ్మవద్దని, యువత చైతన్యంతో ఆలోచించాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో కంపెనీలు స్థాపించి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కుట్రపూరితంగా సంక్షేమ పథకాలను ఆపాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజగోపాల్‌రెడ్డిని కొన్నదని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, మొసలి కన్నీరు కారుస్తూ మళ్లీ ఓట్లు అడగడానికి విమర్శించారు. మరోసారి ఆశీర్వదించి పని చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. అనంతరం కొండూరు, ఎగ్రాలపల్లి, ఆదిలాపురం తిరుమలపల్లి గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 150మంది కార్యకర్తులు ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సురేందర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు భిక్షంరెడ్డి, యాదయ్య
రాజగోపాల్‌రెడ్డి స్వార్థపరుడు..
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థపరుడు. మోసపూరిత వాగ్దానం తప్ప.. ప్రజలకు ఆయన చేసేదేమీ ఉండదు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి దేశ ప్రజలకు కానుకగా ప్రజల ఆత్మగౌరవాన్ని రూ.18వేల కోట్లకు బీజేపీకి తాకట్టుపెట్టిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు