చండూరు, అక్టోబర్ 18 : ముదిరాజ్‌లకు అండగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉడుతపల్లిలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించాకే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌లకు పెద్దమ్మ ఆలయం, ముదిరాజ్ కమిటీ భవన నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌ల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ముదిరాజ్ భవనాన్ని నిర్మిస్తున్నారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బోనాలు, యువకుల నృత్యాలతో బండ ప్రకాశ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఉడుతలపల్లి, కోటయ్యగూడెం, పడమటితాళ్ల, దుబ్బగూడెం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూపారవిముదిరాజ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్నముదిరాజ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగు రవిముదిరాజ్, ఎంపీటీసీ కావలి మంగమ్మ, గ్రామశాఖ అధ్యక్షుడు గుడిసె సత్తయ్య, లింగయ్య, యాదగిరి, లక్ష్మయ్య, కావలి వెంకన్న, చంద్రశేఖర్ పాల్గొన్నారు.